తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడారు. రాజకీయలబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని రోజా తెలిపారు.

చంద్రబాబు డ్రామాలు ప్రజలు నమ్మరని. చంద్రబాబు హుందాగా వుంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు.

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా నూతనంగా రాజధాని బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని రోజా అన్నారు. అయితే తిరుమలలో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వర్షాల ప్రభావం వల్ల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. తిరుమల శ్రీవారిని నిన్న 17,531 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 8,483 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.49 కోట్లుగా నమోదైందని టీటీడీ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here