నేడు హైదరాబాద్ లో ఈటల ర్యాలీ

203

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు మార్మోగిపోతోంది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అద్భుత విజయా్ని సాధించారు.

ఈటల గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఐతే ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో…

తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట ఇవాళ ర్యాలీ చేపట్టనున్నారు ఈటల. మధ్యాహ్నం 1 గంటకు శామీర్‌పేట్‌లోని తన నివాసం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. శామీర్ పేట్, తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్‌పార్క్ మీదుగా బీజేపీ కార్యాలయానికి ఆయన చేరుకుంటారు. మొదట ఆయన గన్‌పార్క్‌కు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వస్తున్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here