దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు.

ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్ పెట్టి మురిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here