ఈ వారం ఎలిమినేషన్ నుంచి అనీ మాస్టర్ సేఫ్

180

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియక ప్రేక్షకులంతా ఎంతో ఎగ్జైటింగ్‌గా బిగ్ బాస్ ను వీక్షిస్తున్నారు.

ఈ రోజు గొడవపడిన వాళ్ళు మరుసటి రోజు ఫెండ్స్ గా మారిపోతున్నారు. అలాగే ఈ రోజు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు రేపు శత్రువులుగా కొట్టుకుంటున్నారు. ఇదికాక బిగ్ బాస్ ఇస్తున్న చిత్ర విచిత్రమైన టాస్క్లు హోస్ మేట్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారంలో ఇంట్లో పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఒక్క కెప్టెన్ షన్ను తప్పా మిగిలిన అందరూ నామినేషన్లోకి వచ్చారు. అయితే వీరికి ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్ నామినేషన్ నుంచి ఒకరు తప్పించుకునే అవకాశం ఇచ్చాడు.

బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుంటాయి. బ్యాగేజ్ జోన్‌లో కంటెస్టెంట్ల ఫోటోలతో బ్యాగులుంటాయి. వాటిని తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్‌లోకి రావాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారు డేంజర్ జోన్‌లోకి వస్తారు. చివరన వచ్చిన కంటెస్టెంట్‌తో పాటుగా వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అలా ప్రతీ రౌండ్లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు. ఒకరి సేఫ్ అవుతుంటారు. ఈ గేమ్ లో ఆనీ మాస్టర్ విన్ అయ్యారు. అయితే గత వారం ఆనీ మాస్టర్‌కు వచ్చిన పవర్‌ను వాడే సమయం వచ్చిందని చెప్పాడు బిగ్ బాస్ దాంతో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు దాంతో మానస్ ను నామినేషన్ నుంచి తప్పించింది ఆనీ మాస్టర్ ఇలా ఆ ఇద్దరు బయట పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here