కేసీఆర్ కి మంత్రి పేర్ని నాని సలహా

163

ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS Party)ని విస్తరించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్న టీఎస్ సీఎం కేసీఆర్ కామంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.

దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలపాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలని అలా అందరం కలిసిపోతే రాష్ట్రమంతటా పోటీ చేసే అవకాశముందన్నారు. సీఎం జగన్ కూడా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీలు పెరిగితే మంచిదేనని… కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని పేర్ని అన్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అసలు సమస్యే ఉండదని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here