ఆయన స్వరం మన తెలుగు జాతికి వరం.ఏ దివిలో విరిసిన పారిజాతమో ఈ భువిలో వెలసిన మన బాలూ.చరణ కింకణులు ఘల్లు ఘల్లు మనేట్టు పలుకుతాయి వారి గొంతుతో గమకాలు.నాద వినోదమై నవరసభావాత్మకమై సంగీత సరస్వతిని నిన్ను చూడక నేనుండ లేనంటూ నిత్యం రాగమే ,వర్దమాన శ్వాసగా,వర్థమాన గాయకులకు బాటగా నిలచిన ఆ వ్యక్తిత్వం కమనీయం…అనుసరణీయం. స్నేహమేరా జీవితమంటూ ఎందరికో ఆత్మీయుడై అలరారిన పాటల దేవుడు.సింహపురికి సిరియై,సాంబమూర్తి తనయుడై సినీవినీలాకాశాన వెలుగొందిన దివ్వయై,తెలుగు వారి గుండె గుడిలో దైవమై,నిలువెత్తు మంచితనానికి రూపమై నిలిచారు మన బాలు.క్రొత్తగళాలకు కూర్మితో ఊపిరి పోసి నారద నీరద మహతీ నినాదమై ముందుండి నడిపించిన సౌజన్యమూర్తి మా బాలు.వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.అటువంటి మహనీయుడు కరోనా రక్కసి కోరలకు చిక్కి మనకు దూరమై అపుడే సంవత్సరంఅయింంది నేటికి.అయినా వారి జ్ఞాపకాలు పదిలం. బరువెక్కిన గుండెలతొ ప్రతి ఒక్కడు తన బాధగా తలుస్తున్నారంటే ఆయన గొప్పతనం అనిర్వచనీయం.అటువంటి మన శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని తలచుకుంటూ ఆయన స్మృతిపథం లో నడుస్తూ సమర్పిద్దాం మనస్పూర్తిగా మన స్మృత్యంజలి…

ఎస్.ఏ.టి.ఎస్.ఆచార్య,హైదరాబాద్

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments