పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. పవన్ కల్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.
కాగా ఈరోజు ఈ మూవీ నుంచి బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేశారు.సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.