ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర. ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణం చేస్తుందని ప్రకటించిన వాతావరణశాఖ..

అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. రేపటికి మరింత బలపడి అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ.. దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసేఅవకాశం.. ఉందని.. రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments