గాన గంధర్వులు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగుతున్న ధారావాహిక పాడుతా తీయగా. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులు వెలుగులోకి వచ్చారు, అలా వెలుగులోకి వచ్చినవారిలో నెల్లూరు కు చెందిన ప్రవీణ్ కుమార్ కొప్పోలు ఒకరు. పాటలే కాకుండా పద్యాలను సైతం తనదైన ధోరణిలో అద్భుతంగా ఆలపించగలగడం ప్రవీణ్ గొప్పతనం. ఆయన మంచి గాయకుడి కాకుండా మంచి డాన్సర్ కూడా,విదేశాలలో అనేక షోలలో ఆయన పాటతో తో పాటు డాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తుంటారు. ఈయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎన్నో మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారనే విషయం అందరికీ విదితమే. అయితే ఇప్పుడు ఆయన తానే సంగీతం వహించి,పాడి నటించిన పాట “ప్రేమించా మనసారా” ఆయన యూట్యూబ్ ఛానెల్ లో విడుదలై సంగీత అభిమానులందరినీ అలరిస్తోంది. ఈ పాట ఒక తెలుగులోనే కాక హిందీ,తమిళ,కన్నడ భాషలలో ఈ పాట రూపొందింది. ఈ పాట పోస్టర్ ను ప్రముఖ హాస్యనటులు ఆలీ గారు ఆవిష్కరించగా, గాయకులూ మనో ఈ పాటను విడుదల చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రవీణ్ ఇంకా మరెన్నో ఇటువంటి మంచి మాధుర్యభరితమైన పాటలను రూపొందిస్తూ జీవితంలో ఎంతో ఉచ్చ స్థాయికి చేరాలని మన తాజావార్తలు ద్వారా కోరుకుందాం .

మీరు కూడా ఈ పాటను ఓ లుక్కేయండి

-ఎస్ ఏ టి శ్రీనాథ్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments