ఎమ్మెల్సీ గా కౌశిక్ రెడ్డి

598

గత నెలలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసింది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన కౌశిక్ రెడ్డి.. ఆ పార్టీలో టికెట్ వచ్చేలా లేకపోవడంతో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిలో బరిలో ఉంటారని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా మండలికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజూరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయిస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here