తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దాదాపు 5 లక్షమంది వరద బాధితులు 2020 అక్టోబర్ నుంచి నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని, నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయిల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా వేశారని ఆయన చెప్పారు. ఈ నష్ట పరిహారాన్ని ఎప్పుడు చెల్లిస్తారు, నాళాల వైడింగ్, స్ట్రాటజిక్ నాళా డెవలప్‌మెంట్ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసి, వరదల నుంచి హైదరాబాద్‌ను ఎప్పుడు కాపాడతారని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments