తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సూపర్ హీరో అంటూ సోనూసూద్‌ను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేయగా.. నిజమైన హీరో మీరేనంటూ సోనూ రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేటీఆర్ కార్యాలయం నుంచి సాయమందుకున్న నందకిషోర్ అనే వ్యక్తి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. ‘మీ సాయాన్ని మరవలేం, మీరు సూపర్ హీరో’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సమాధానమిస్తూ తానొక సాధారణ ప్రజాప్రతినిధిని మాత్రమేనని.. సోనూ సూద్ అసలైన సూపర్ హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సోనూ ట్విటర్ అకౌంట్‌ను జత చేశాడు.

కేటీఆర్ ట్వీట్‌కు స్పందనగా సోనూసూద్ మరో ట్వీట్ చేశాడు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న నిజమైన హీరో కేటీఆర్ అని పేర్కొన్నాడు. తెలంగాణను తన రెండో ఇంటిగా భావిస్తానని.. ఏళ్లుగా ప్రజలు తనపై కురిపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు.

సాయమడిగిన వారికి.. తమ దృష్టికి వచ్చిన అంశాలపై తక్షణం స్పందిస్తున్న కేటీఆర్, సోనూసూద్‌లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్దరికి తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments