కరోనా కాలంలో అర్చకులు, ఇమామ్‌లు, మౌజంలు, పాస్టర్లకు జగన్ సర్కార్ శుభవార్తను అందించింది. వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ తాజాగా పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకుల గౌరవ వేతనాన్ని రూ. 10 వేల నుంచి రూ. 15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. అలాగే ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. అటు పాస్టర్లకు ప్రతీ నెలా రూ.5 వేలు గౌరవ వేతనంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అటు ఈ కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కింద వరుసగా మూడో ఏడాది రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే గురువారం రూ. 130.46 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18న మత్స్యకారుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments