కరోనా మహమ్మారి కోరలు చాస్తుండడంతో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. సామ్యానులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడడం కలవర పరుస్తుంది. తాజాగా రైటర్, డైరెక్టర్ నంద్యాల రవి కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి బిల్లు ఇప్పటి వరకు 6 నుండి 7 లక్షల వరకు కాగా, వైద్యానికి అంత పెట్టే స్థోమత వారి దగ్గర లేదట. ఈ విషయం కమెడీయన్ సప్తగిరికి తెలియడంతో మానవత్వం చాటుకున్నాడు.

నంద్యాల రవి ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న సప్తగిరి లక్షల రూపాయలు కుటుంబానికి అందించారట. సప్తగిరి ఉదారతను తెలుసుకున్న నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది కరోనాతో సినీ కార్మికులు ఇబ్బంది పడగా, వారిని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఏర్పాటు చేయగా, దీనికి తన వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించారు సప్తగరి. ఈయన కమెడీయన్‌గానే కాక అడపాదడపా హీరోగాను సినిమలు చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments