మరణం ముంచుకొస్తుందని అర్థమయ్యాక, ఉరిరూపంలో ప్రాణాలు హరిస్తారని తెలిసాక ఎం అవుతుంది..?గుండెల్లో కూడా వణుకు పుట్టడం ప్రారంభం అవుతుంది కాని, ఆ నూనుగు మీసాల యువకుడు మాత్రం నవ్వుతు ఉరికంబాన్ని ఎక్కాడు. అతని గుండె ధైర్యాన్ని చూసి చావు కూడా భయంతో భీతిల్లింది. ఆంగ్లేయుడి గుండెకి గన్ గురిపెట్టలేదు. బ్రిటిష్ వాడి గుండెల్లో బులెట్ ను దించి, తెల్లోడికి తన ఉద్యమంతో ముచ్చెమటలు పట్టించిన ధీశాలి అతను. అతనే భగత్ సింగ్. అతని జీవితం ఓ పోరాట కెరటం..భగత్ మరణం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే సమరనినాదం. తాను బ్రతికిన అతి తక్కువ వయస్సులోనే బ్రిటిష్ పాలకుడికి ముచ్చెమటలు పట్టించిన భగత్ సింగ్ ఎలా చనిపోయాడు..? అతని ఎందుకు చంపేశారు..?ఇంతకీ ఆ పోరాటయోధుడిని ఎందుకు చంపేశారు అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

1931 మార్చి 23వ తేదీ..సమయం రాత్రి ఏడున్నర…ప్లేసు లాహోర్ జైలు. భయమంటే ఎరగని వీరుల ఆశయాలు చీకటి తనలో కలిపెసుకోబోతుంది. విప్లవం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మిన ఆ వీరులకు అంతం పలికే సమయం ముంచుకువచ్చింది. స్వేచ్చ, స్వాతంత్ర్యన్ని కాంక్షించిన ఆ పోరుకెరటాలు ఇంకాసేపట్లోనే మూగబోతున్నాయి. అప్పుడే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరికంబం ఎక్కించారు. మృత్యువు కల్లముందు కనబడుతున్నా కొంచెం కూడా ఆ పోరాట వీరులలో భయం లేదు. చావును కూడా వారు ధైర్యంతోనే చంపేస్తారా అనేలా గుండె ధైర్త్యాన్ని ప్రదర్శించి ఉరిబిగించే వాళ్ళకు సైతం చెమటలు పట్టించారు. తమ మరణం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావాలని కల కన్నారు వారు. అందుకే వారు చనిపోయి ఏండ్లు గడుస్తున్నా, ఇంకా కోట్ల మందిలో చెరగని రూపంగా ఇప్పటికీ చరిత్రసాంతం గుర్తిండిపోయారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ఆశయం వృధా కాలేదు. వారి పోరాట స్పూర్తితో భారతమాత దాస్య శృంఖాలలను తెంచటానికి స్వాతంత్ర్య పోరాటంలోకి కొదమ సింహాలా దూకారు ఎంతోమంది. వారి మరణం పడుతూ, లేస్తున్న స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరో రూపంలోకి తీసుకెళ్ళింది. తమను ముప్పుతిప్పలు పెట్టిన ఆ విప్లవ వీరులను హడావిడిగానే ఉరితీశారు. అందుకే మేజిస్ట్రేట్ సమక్షంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన లేకుండానే పూర్తి చేశారు. అంతేకాదు…మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయలేదు.. బంధువులు వారిని కడసారి చూసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు నాటి జైలు అధికారులు. ఇలా నాటి బ్రిటిష్ అధికారులు ఎందుకు చేశారు అన్నది ఇప్పటికీ అంతచుక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతకీ వారిని అంత తొందరగా ఎందుకు ఉరితీశారు..?దీని వెనక ఏదైనా కుట్ర ఉందా..? ఇంతకీ భగత్ ను సింగ్ ను ఎందుకు ఉరితీశారు..? ఉరి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని ఎందుకు భగత్ సింగ్ ఉపయోగించుకోలేదు…?

తిరుగుబాటు ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని బలంగా నమ్మాడు భగత్. తన గురువుగా భావించిన లాల లజపతిరాయ్ 1928లో వచ్చిన సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాహోర్ లో శాంతియుత నిరసన చేపట్టాడు. అక్కడ జరిగిన లాటీ చార్జీలో లాలా చనిపోయాడు. ఇది భగత్ లో తీవ్ర అగ్రవేశాలను రగిల్చింది. తన గురువు చావుకు కారణమైన పొలిసు ఆఫీసర్ స్కార్ట్ ను చంపాలని భగత్ డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది..అనుకున్నదే తడువుగా.,. శివరాం గురు, జైగోపాల్, సుఖ్ దేవ్ తో కలిసి స్కార్ట్ ను చంపేందుకు స్కెచ్ వేశారు. ఇక్కడే భగత్ టీం ఓ పొరపాటు చేసింది. స్కర్ట్స్ ను గుర్తించడంలో జైగోపాల్ పొరపాటు చేయడంతో డీఎస్పీ సాండర్స్ చనిపోయాడు. ఈ హత్య తరువాత కొన్ని రోజులపాటు భగత్ అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

రోజురోజుకు భారత్ లో స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు మరింతగా ఉదృతం అవుతున్నాయి. ఇలాగే ఈ పోరాటాలను లైట్ తీసుకుంటే స్వాతంత్ర్యం ఇవ్వకతప్పదని భావించిన బ్రిటిష్ సర్కార్..కటిన చట్టాలు చేసింది. అందులో భాగంగా డిఫెన్స్ యాక్ట్ 1915 తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం పొలిసు పవర్ ను మరింత విస్తృతపరిచే అవకాశం కల్పించింది. ఈ చట్టంపై నిరసన తెలపాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబ్ పెట్టాలనుకున్నాడు. ఇందుకోసం భట్ కేశ్వర్ దత్, సుఖ్ దేవ్ అసెంబ్లీలో బాంబ్ పేల్చాలని ప్లాన్ వేశారు. ఆ తరువాత సోవియట్ కు భగత్ వెళ్ళిపోవాలి. కాని ఏమైందో ఏమో అసెంబ్లీలో బాంబ్ విసిరి స్వచ్చందంగా అరెస్ట్ కావాలనుకున్నాడు భగత్. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన చట్టంపై చర్చ జరుగుతున్నప్పుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి భట్ కేశ్వర్ దత్, భగత్ లు బాంబ్ విసిరారు. బాంబ్ విసరడమే కాకుండా ఇంక్విలాబ్ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగేలా చేశారు. అయితే..పక్కా ప్లాన్ గా వచ్చి ఎవరూ లేని ప్లేసులో బాంబ్ పేల్చడంతో వారి ప్లాన్ ఏంటో అక్కడి వారిలో ఎవరికీ అర్తం కాలేదు. ఆ తరువాత ఆ ఇద్దరు పోలీసులకు స్వచ్చందంగా లోగిపోయారు.

హత్యయత్నం కేసు కింద 1929మార్చి ఏడున భగత్ , భట్ కేశ్వర్ లపై విచారణ ప్రారంభమైంది. అయితే.. తాను లేకపోయినా స్వాతంత్ర్యం కోసం జరిగే ఉద్యమ పంథా అలాగే కొనసాగాలని అనుకున్న భగత్ కోర్టు విచారణను చాలా తెలివిగా యూజ్ చేసుకున్నాడు. విచారణ సందర్భంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..బాంబులు ఎలా తయారో చెప్పేవాడు. ఇవ్వనీ నెక్స్ట్ డే పేపర్ లో ప్రచురితం అయ్యేవి. సో, బాంబ్ ల తయారీ విధానం చాలామందికి తెలిసిపోయింది. భగత్ ప్లాన్ ను చాలా ఆలస్యంగా బ్రిటిష్ సర్కార్ పసిగట్టింది. అసెంబ్లీలో బాంబ్ విసిరినప్పుడు భగత్ తన రివాల్వర్ తో లొంగిపోయాడు. ఇదే అతడి జీవితాన్ని ఎవరూ ఊహించనివిధంగా మలిచింది. చనిపోయిన పొలిసు అధికారి సాండర్స్ డెడ్ బాడీలో దిగిన బులెట్ భగత్ రివాల్వర్ లోని తూటానేనని తెలిసిపోయింది బ్రిటిష్ అధికారులకు. దీంతో భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లపై లాహోర్ కుట్ర కేసు నమోదు చేశారు. నామ్కే వాస్తేగా సాగిన విచారణ తరువాత 1930 ఆక్టోబర్ ఏడున ముగ్గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

కోర్టు ముగ్గురికి ఉరిశిక్ష విధించడంతో దేశవ్యాప్తంగా ఓ రకమైన ఆవేదన భరిత సన్నివేశాలతోపాటు, అగ్రవేశాలు చోటుచేసుకున్నాయి. పోరాటమే ఊపిరిగా బ్రతికిన భగత్ టీంకు ఉరిశిక్ష విధించడం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి తీరనిలోటని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దుకు ప్రయత్నాలు ఏమైనా జరిగాయా..?గాంధీకి, భగత్ కు మధ్య విబేధాలు ఉండేవా..?భగత్ ను కాపాడే ప్రయత్నాలను గాంధీ ఎందుకు చేయలేదు..?

అందరిలాగే భగత్ కూడా మహాత్ముడిని అభిమానించేవాడు. గాంధీ నేతృత్వంలోనే స్వాతంత్ర్యం వస్తుందని బలంగా విశ్వసించేవాడు. 1920లో బ్రిటిష్ పాలకులను దేశం వదిలి వెళ్ళేలా సహాయ నిరాకరణకు గాంధీజీ పిలుపునిచ్చాడు. మహాత్ముడి పిలుపుకు జనమంతా అనూహ్యరితిలో స్పందించారు. ఆ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. ఇంకొన్ని రోజులు సహాయ నిరాకరణ ఇలాగే కంటిన్యూ అవుతే బ్రిటిష్ వాళ్ళు మూటముళ్ళ సర్డుకోవాల్సిదేనన్న పరిస్థితులు దాపురించాయి. కానీ, ఇంతలోనే గాంధీ సహాయ నిరాకరణ ఆపేయాలని, చౌరా చౌరీ దుర్ఘటన కారణంగా సహాయనిరాకరణను సడెన్ గా ఆపేయాలని పిలుపునిచ్చాడు. దీంతో మహాత్ముడి ఈ నిర్ణయంతో గాంధీజీపై ఉన్న ఒపినీయన్ ను మార్చుకున్నాడు భగత్. యుద్ధం అనివార్యమైన చోట చేయాల్సింది శాంతి ప్రవచనాలు కాదని, అనివార్యంగా ప్రతిగా పోరాటమేనని పరిస్థితులను చూసి అవగాహనాకు వచ్చాడు భగత్. బ్రిటిష్ పాలకుల ముందు చేతులు కట్టుకొని నిల్చోవడం కాదని, ఎదురించి నిలబడాలని అనుకున్నాడు. గాంధీ అహింస నినాదంతో స్వాతంత్ర్యం రాదనీ నిర్ణయించుకున్నాడు. విప్లవంతోనే బ్రిటిష్ వాళ్ళను దేశాన్ని నుంచి తరిమేయలని భావించాడు. తనకు నచ్చిన పంథాలో స్వాతంత్ర్య సంగ్రామంలో దూసుకెళ్ళాడు భగత్. అహింస విధానం ఒక్కటే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాలేదని నమ్మిన భగత్ పోరాట పంథా గాంధీజీకి నచ్చలేదు. అలాగే, లాహోర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరినా భగత్ టీం పోరాటాన్ని గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కారణం చేతనే భగత్ ఉరిని రద్దు చేయించే ఛాన్స్ ఉన్నప్పటికీ గాంధీజీ ఆ ప్రయత్నం చేయలేదని కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు. అందుకే భగత్ సింగ్ ఉరి తరువాత లాహోర్ కు వచ్చిన గాంధీకి వందలాదిమంది నల్లజెండాలతో నిరసన తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ చెరగని సంతకం. భగత్ సింగ్ ను భౌతికంగా చంపేసినా, ఆయన పోరాట స్పూర్తిని మాత్రం ఎం చేయలేకపోయారు. ఉద్యమంలో తన పాత్ర తక్కువ సమయమే అయినా, తాను ఉద్యమంలో ఉన్నంతకాలం దేశప్రజలను కదిలించిన తీరు మాత్రం ఎప్పటికీ శాశ్వతంగానే ఉండిపోతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments