అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేయనున్నారు. సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కాగా, చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి. గవర్నర్‌ ప్రసంగంపై ఈనెల 17న ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టడంతోపాటు దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 18న బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నది, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ జరగనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments