గత సంవత్సరం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో ఎంతగా అల్లకల్లోలం సృష్టించిందో అందరికి తెలిసిందే.ఒక్కసారిగా మానవ జీవితాలను ఓ కుదుపు కుదిపేసి చరిత్రలో తన కంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది.

దీని దాడికి అగ్ర రాజ్యాలు కూడా గడగడలాడాయి.

ఈ సమయంలో డబ్బు కూడా మనుషుల ప్రాణాలను కాపాడలేక పోయింది.

మొత్తానికి కరోనా ఒక జీవిత సత్యాన్ని కళ్లముందు ఆవిష్కరించింది.ఇదిలా ఉండగా దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచుతోంది.

దీంతో దాయాది దేశం అయినా పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారు.

ఈమేరకు పంజాబ్ లోని ప్రావిన్స్ లోని ఏడు నగరాలైనా లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగనుందిని అధికారులువెల్లడించారు.

కాగా రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పాటించాలని ఓ ప్రకటన రిలీజ్ చేసింది ఇక్కడి ప్రభుత్వం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments