అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై ఓ మందుబాబు దాడికి యత్నించారు. ప్రచారపర్వంలో భాగంగా కమల్ హాసన్ కంచీపురంలో పర్యటించి తిరిగి హోటల్‌కు కారులో వెళుతుండగా ఓ యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మద్యం తాగి ఉన్న యువకుడు కమల్ హాసన్‌ను కలిసేందుకు కారును అడ్డుకోబోయాడు. ఈ ఘటనలో కారు కిటికీ దెబ్బతింది. యువకుడి దాడిలో కమల్ హాసన్ కు ఎలాంటి గాయాలు కాలేదని, కారు అద్దం పగిలిందని ఎంఎన్ఎం కార్యకర్తలు చెప్పారు.

కమల్ హాసన్ పై దాడి చేసిన యువకుడిపై ఎంఎన్‌ఎం కార్యకర్తలు దాడికి దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి యువకుడిని పట్టుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. యువకుడు మద్యం తాగి ఉన్నాడని, కమల్ హాసన్‌ను చూడాలని కారు కిటికీ అద్దాన్ని పగులగొట్టాడని పోలీసులు చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments