ఇప్పటికే విద్యార్థి, మహిళా సంఘాలతో సమావేశమైన షర్మిల రాజకీయ ప్రవేశంపై ఓ క్లారిటీతో ఉన్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇస్తారని నేతలు చెబుతున్నారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపన, దాని విధివిధానాలకు సంబంధించిన వివరాలు అక్కడ వెల్లడించే అవకాశముంది. ఖమ్మం సభ తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల.. జులై 8న పార్టీని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే ఖమ్మం తరువాత, పార్టీ కార్యకర్తలతో
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వైఎస్ఆర్‌ అభిమానులతో లోటస్ పాండ్‌లో ఈ నెల 18న షర్మిల సమావేశం కానున్నారు. వాస్తవానికి కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల అభిమానులతో ఈ నెల 19న ఉమ్మడి సమావేశం నిర్వహించాలని భావించారు. అయితే, శుక్రవారం లోటస్ పాండ్‌కు వచ్చిన కరీంనగర్‌ జిల్లా నేతలు తమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని షర్మిలను కోరారు. దీనికి షర్మిల కుడా ఓకే అన్నట్లు కార్యకర్తలు తెలిపారు.

ఐతే ఈనెల 18న లేదా 19న కరీంనగర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అభిమానుల్లో కోలాహలం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ ప్రచారం జోరుగా సాగుతుంది. టికెట్ ఆశించి బంగపడ్డ అన్ని పార్టీలా చోట మోట లీడర్స్ అందరు షర్మిల పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వెడిక్కిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ కు కంచుకోటలా ఉన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ని షర్మిల పార్టీ కంచుకోట ను ఢీకొట్టనుందా, లేదా బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ సొంత ఇలాకాలో షర్మిల పార్టీ ఏ మేరకు రాణించనుందో అని రాజకీయ విశ్లేషణకులు అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని విడి కారు, కమలం గూటిలో చేరారు. ఇక షర్మిల పార్టీ పెట్టిన తరువాత కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ కానుంది అని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల జగన్ తెలంగాణా మీదికి వదిలిన బాణం అంటూ టీఆరెఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది . బిజెపి పార్టీ మాత్రం కచ్చితంగా ఇది టీఆరెఎస్, జగన్ కలిసి బిజెపి మీదికి వదిలిన బాణం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి షర్మిల కరీంనగర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో ఒక్కసారీ రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments