తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన మాతృమూర్తిని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకున్నారు. తన తల్లి ఇచ్చిన స్పూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కార్యక్రమంలో స్త్రీ మూర్తుల గొప్పదనాన్ని కొనియాడే పాటలను ప్లే చేయడంతో… వేదికపై ఉన్న పోచారం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారిగా దు:ఖం పొంగుకురాగా రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని ఆయన దు:ఖించారు. ఈ సందర్భంగా పక్కన ఉన్నవారు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ… తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తుచేసుకున్నారు.

102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని… ఆమె ఇచ్చిన స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన భార్య పుష్పమ్మ అందించిన తోడ్పాటు కూడా మరువలేనిది అన్నారు. ఈ ఇద్దరు స్త్రీ మూర్తుల వల్లే తాను ప్రజా జీవితంలో విజయం సాధించానన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments