ఒకవైపు దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ ‌మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్‌-19కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. దీనిపై ఆర్‌కే తల్లి, నటి నీతూ కపూర్‌ తన ఇన్‌స్టాలో రణబీర్‌ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె ప్రస్తుతం రణబీర్‌ కోలుకుంటున్నాడనీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. దీంతో కార్యక్రమాలకు బ్రేక్‌ చెప్పి రణబీర్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments