పెట్రోల్ పేరు చెప్తేనే మంటలు రేగుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (సోమవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (సోమవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (సోమవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (సోమవారం రూ.88.60 ) గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (సోమవారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (సోమవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (సోమవారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (సోమవారం రూ. 88.45 )గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.00 (సోమవారం రూ.97.00 ), డీజిల్‌ ధర రూ. 90.82 (సోమవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.55 (సోమవారం రూ. 93.55 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.35 (సోమవారం రూ.89.92 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (సోమవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.58 (సోమవారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (సోమవారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (సోమవారం రూ. 86.37 ) గా ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments