బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడనే విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకంగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా హాజరై గాలి సంపత్ బిగ్ టికెట్‌ని ఆవిష్కరించారు.

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ మాట్లాడుతూ.. ”మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యిందే రాజేంద్ర ప్రసాద్‌గారి లేడిస్ టైలర్ సినిమాతో. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్నగా కనపడుతుంది. సినిమా పరిశ్రమకి దొరికిన ట్రెజర్ ఆయన. గాలి సంపత్ సినిమాకి రాజేంద్ర ప్రసాద్ గారికి హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూడగానే ఇది తప్పకుండా అవార్డ్ విన్నింగ్ ఫిలిం అనిపించింది. శ్రీ విష్ణు మంచి స్నేహితుడు. మోస్ట్ జెన్యూన్ పర్సన్. ఈ సినిమా శ్రీ విష్ణుకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు సాహూ గారికి, హరీష్ గారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న రైటర్ సాయి నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే రాజ్ కుమార్ హిరాణి స్టైల్ కనిపించింది. ఈ సినిమా సాయి కెరీర్‌లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. లవ్ లీ సింగ్ స్క్రీన్ మీద లవ్‌లీగా ఉంది. అనీష్ కి ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అనిల్ నాకు అసోసియేట్ డైరెక్టర్ నుండి బాగా తెలుసు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకి కెమెరా వెనక సూపర్‌వైజ్ చేశారు. అలా చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కాని బయటకు రాలేదు.. ఫస్ట్ టైమ్ బయటకు వచ్చి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు అని నేను నమ్ముతున్నాను. చాలా జెన్యూన్ పర్సన్‌. అనిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఇన్ తెలుసు సినిమా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ”మేం అడిగిన వెంటనే వచ్చిన రామ్ గారికి థ్యాంక్స్‌. నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ కథ రాసుకున్నా హీరోగా రామ్‌ మైండ్‌లోకి వచ్చేవారు. కంప్లీట్ యాక్టర్ ఆయన. గాలి సంపత్ జర్నీ.. నా లైనప్ లో నేను ఉన్నప్పుడు ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా అలా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఈ కథ వినగానే ఎవరు చేస్తున్నారు అనగానే రాజేంద్ర ప్రసాద్‌గారు అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఈ కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ సినిమా చేశారు. నేను ఇంత వరకూ ఏ సంస్థలో ట్రైనింగ్ తీసుకోలేదు. కాని ఈ సినిమాతో వరల్డ్‌లో బెస్ట్ యాక్టర్ దగ్గర నేను ట్రైన్ అయ్యాను. అది నా తర్వాతి చిత్రాల్లో మీరు కూడా చూస్తారు. క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన నటనకి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అద్భుతంగా నటించారు” అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments