మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్‌ వద్ద ఇప్పటికీ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులను తిరగరాసింది. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతం, విజయ్‌ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్‌ అయింది. విలన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది.

అయితే ఈ కుర్ర హీరో మొదటి సినిమా రిలీజ్ అవ్వక ముందే రెండో సినిమాను పూర్తి చేసాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు . క్రిష్ ఫ్రెండ్ వై.రాజీవ్‌రెడ్డి, తండ్రి జాగర్లమూడి సాయిబాబా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అత్యంత సహజత్వంగా రూపొందినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు కొండ పొలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక వైష్ణవ్ త్వరలో తన మూడో ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుండి ఓ నూతన దర్శకుడు వైష్ణవ్ మూడో సినిమా తెరకెక్కించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో నాలుగో సినిమాను కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. ఆ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇలా వరుస సినిమాలతో ఈ మెగా హీరో ఫుల్ బిజీగా మారిపోయాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments