ఎవరూ ఊహించలేనిది జీవితం. కేవలం ఒక్క క్షణం చాలు మొత్తం తారుమారు అవ్వడానికి. వివిధ కారణాల వలన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురుకోవలసి వస్తుంది, కానీ ఆపదలు వచ్చిన సమయంలో మనిషి ఎలా స్వీకరిస్తాడు అనే విషయం మీద తన తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. చిన్న కష్టం రాగానే భయపడిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఈ సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం. అది చాలా తప్పు,కష్టాలను ఎదురుకొని నిలబడినప్పుడే జీవితంలో ఉండే మధురానుభూతిని పొందగలుగుతాము.

ఇలా మన జీవితంలో ఏ విధంగా ఉండాలి అని తెలిపే పాటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంలోని ఛల్ ఛలో ఛలో పాట . ఈ పాటకు ప్రముఖ రచయత రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. అతి సరళమైన పదాలతో కూడిన ఈ పాట వింటుంటే మన ఆలోచనా ధోరణిలో మార్పు రాక తప్పదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు డీలా పడిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లి జీవితం గెలవాలనేది ఈ పాటలోని సారం.

ఈ పాటలోని సాహిత్యాన్ని పరిశీలిస్తూ విశ్లేషణ కొనసాగిద్దాం.

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు..

రాజ్యం ఇడిసేటోడే రామసంద్రుడు

యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు

యుద్ధం ఇడిసేటోడే దేవుడు

ఛల్ ఛలో ఛలో…

లైఫ్ సే మిలో..

ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో…

ఛల్ ఛలో ఛలో…

చలించు దారిలో…

ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో…

తీపితో పాటుగా ఓ.. కొంత చేదు

అందించడం జిందగీకీ అలవాటే…

కష్టమే రాదనే గ్యారంటి లేదు

పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే

అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని

మొదటి నాలుగు లైన్లు చూస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది.

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు..

రాజ్యం ఇడిసేటోడే రామసంద్రుడు

యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు

యుద్ధం ఇడిసేటోడే దేవుడు

మనకి జీవితంలో ఎన్నో సుఖాలు ఉండడం గొప్ప కాదు, కానీ ఒక్కసారిగా సుఖాలు అన్నీ దూరమయ్యే పరిస్థితి వస్తే అలవోకగా విడిచిపెట్టి ముందుకు వెళ్లాలనేది ఇందులోని భావం. తనకు అన్ని సుఖాలు కలిగి రాజయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఏమి మాట్లాడకుండా రాముడు అడవులకు వెళ్ళాడు కాబట్టే ఇప్పటికీ మనం కధలు కధలుగా చెప్పుకుంటున్నాం. అలా వచ్చిన కష్టాన్ని స్వీకరించి ఓర్పుతో ముందుకు వెళ్లినవాడు ఎప్పటికైనా దేవుడంత గొప్ప వాడవుతాడని అర్ధం.

ఛల్ ఛలో ఛలో…

లైఫ్ సే మిలో..

ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో…

ఛల్ ఛలో ఛలో…

చలించు దారిలో…

ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో…

తీపితో పాటుగా ఓ.. కొంత చేదు

అందించడం జిందగీకీ అలవాటే…

కష్టమే రాదనే గ్యారంటి లేదు

పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే

అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని

తరువాతి లైన్లో మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని అద్భుతంగా తెలిపారు శాస్త్రి గారు . ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిని స్వాగతించి మన జీవితంలో మనం నేర్చుకోడానికి దొరికిన ఒక గొప్ప అవకాశంగా భావించి ఎదురయ్యే ప్రతీ ఒక్క అవరోధాన్ని దాటుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది ఇందులోని సారాంశం .

జీవితం ప్రతీ ఒక్కారికీ పాఠాన్ని నేర్పుతుంది అని అంటారు. ఈ విషయాన్నే ప్రతిబింబిస్తూ శాస్త్రి గారు తరువాతి లైన్లలో తెలిపారు.

తీపితో పాటుగా ఓ.. కొంత చేదు

అందించడం జిందగీకీ అలవాటే…

కష్టమే రాదనే గ్యారంటి లేదు

పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే

అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని

ఎప్పుడూ సుఖాలతో ఉంటూ సాఫీ గా సాగిపోతే జీవితం విలువ ఏమి తెలుస్తుంది. అందుకనే జీవితం మనకు కొన్ని కష్టాలు అందించి జీవితం యొక్క విలువను తెలియజేస్తుందట,ఇక్కడ సుఖాలను తీపితో కష్టాలను చేదుతో పోల్చి అందరికీ అర్ధమయ్యేలా చేశారు శాస్త్రి గారు. కష్టం ఏ సమయంలో ఏ విధంగా వస్తుందో ఎవారూ కూడా ఊహించలేం. అదే విషయాన్ని కష్టమే రాదనే గ్యారంటి లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బతుకంటే లైన్ల ద్వారా తెలుస్తుంది. సాఫీగా పరిగెత్తి గెలిచేకంటే కింద పడి లేచి మళ్ళీ అదే ఉత్సాహంతో పరుగందుకొని గెలిస్తే ఆ ఆనందమే వేరు,అదే ఆనందాన్ని మనకు తెలియజేయడానికి జీవితం కొన్ని కష్టాలను సృష్టిస్తుందని ఇందులోని భావం. ఆ కష్టాలను మనం భారంగా భావించకుండా ఆ సమయంలో మరింత ఉత్తేజంతో ముందుకు వెళ్లాలనేది ఈ లైన్లలో సారాంశం. కేవలం కొద్దీ లైన్లలో అసలు మన జీవితం అంటే ఏంటి అనే విషయాన్ని అద్భుతంగా తెలిపారు శాస్త్రి గారు.

కన్నీరెందుకు ఉప్పగుంటాయ్ …

తీయగుంటే కడదాకా వదలవు గనక

కష్టాలెందుకు బరువుగుంటాయి

తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించం గనుక

బెదురే లేని నీకు గాక

ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక

చూద్దాం అంటూ నీ తడాఖా

వచ్చింది ఈ బండి నువ్వున్న ఇంటి గడప దాకా

పడ్డవాడే కష్టపడ్డవాడే

పైకి లేచే ప్రతోడూ

ఒక్కడైనా కానరాడే

జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు

ఈ చరణంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి , ఎందుకు మనకు కష్టాలు వస్తాయి , ఏం చేస్తే మనకు కష్టాలు తొలగిపోయి సుఖాలు దాసోహం అంటాయి అనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలిపారు రామజోగయ్య శాస్త్రి గారు .

కన్నీళ్లు కష్టానికి చిహ్నం,మరి అటువంటి కన్నీరు ఎవరూ కూడా ఇష్టపడరు. ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కన్నీళ్లు ఉప్పగా మనకు బాధను కలిగించేట్టుగా ఉంటాయి కాబట్టే మనం వాటి నుంచి దూరంగా వెళ్లాలని కృషి చేస్తామని అదే కనుక కన్నీళ్లు తీయగా అంటే కష్టాలు మనకు హాయినిస్తే మనం జీవితంలో పురోగతి సాధించకుండా కష్టాలను అనుభవిస్తామని అర్ధం. ఇంత చిన్న లైన్లో అంత గొప్ప అర్ధాన్ని చాలా గొప్పగా తెలిపారు శాస్త్రి గారు. మనకు తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టే మనకు కష్టాలు కలుగుతాయని చాలా మంది చెప్తుంటారు, ఇదే విషయాన్ని తరువాతి లైన్లలో రామజోగయ్య శాస్త్రి గారు కొన్ని ఉదాహారణలతో తెలిపారు. నిప్పుల మీద నడక సులువైనది కాదు,చాలా కఠినమైనది. ఇక్కడ నిప్పుల నడక అంటే కష్టాలు,ధైర్యం తో ఉన్న వారికే కష్టాలు వస్తాయి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు వెళ్లాలని అర్ధం. మన జీవితంలో పాఠాలు నేర్పడానికి కష్టం అనే బండి మన గడపదాకా వచ్చి మనల్ని పలకరిస్తుందని అర్ధం.

పడ్డవాడే కష్టపడ్డవాడే

పైకి లేచే ప్రతోడూ

ఒక్కడైనా కానరాడే

జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు

కాబట్టి జీవితంలో ఎక్కువ సుఖపడకుండా జీవితంలో పడి లేచి కష్టపడిన వాడే జీవితంలో గెలిచి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇలా జీవితంలో కష్టపడకుండా ఎవరూ కూడా విజయం సాధించలేదని అర్ధం.

మడతే నలగని షర్టు లాగా

అల్మరాలో పడి ఉంటే అర్ధంలేదు

గీతే తగలని కాగితంలా

పుట్టిచెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు

పుడుతూనే గుక్క పెట్టినాకా

కష్టమన్న మాటేమి కొత్తేం కాదు

కొమ్మల్లో పడి చిక్కుకోకా

ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగురలేదు

ప్లస్సు కాదు మైనస్సు కాదు

అనుభవాలే ఏవైనా …

ఓర్చుకుంటూ నేర్చుకుంటూ

సాగిపోరా నీదైనా గెలుపు దారిలోనా..

జీవితం కష్టాలు లేకుండా సాఫీగా సాగితే నేర్చుకునే అవకాశం ఉండదు కదా,అదే విషయాన్ని రెండొవ చరణంలో సరళంగా అందరికీ అర్ధమయ్యే విధంగా తెలిపారు రామజోగయ్య శాస్త్రి గారు. ఇక్కడ మడత పడని షర్టు. గీత పడని కాగితం అంటే మన జీవితంలో సవాళ్లు లేకుండా ఉండడం. షర్టు నలగకుండా అల్మారాలో ఉండడం వలన ఏమి ఉపయోగం ఉండదు అలాగే కాగితాన్ని ఉపయోగించకుండా ఉంటే చెదలు పట్టి ఏమి ఉపయోగం ఉండదు. అందుకని కచ్చితంగా ప్రతీ మనిషి కష్టాలను ఎదురుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తే ఏమి ఉపయోగం ఉండదు. అందుకని కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా వాటిని స్వీకరించి జీవితంలో ప్రగతి వైపు అడుగులు వేయాలని అర్ధం.

ఇక ఆ తరువాతి లైన్లలో మన పుట్టుకతోనే కష్టాలు ఉన్నాయని గుర్తుచేశారు శాస్త్రి గారు. మనం ఎంతో కష్టంతో తల్లి గర్భంనుండి ఈ లోకానికి వస్తాం. మరి పుట్టుకతోనే అంత పెద్ద కష్టాన్ని అధిగమించిన మనం మనకు ఎదురయ్యే కష్టాలను చాలా చిన్నవిగా భావించి వాటిని అధిగమించాలని అర్ధం. ఏ గాలిపటమైనా కూడా చెట్ల కొమ్మల్లో చిక్కుకోక తప్పదు, అలా చిక్కుకున్నా ఆకాశమంత ఎత్తు ఎగురుతుంది, అలాగే మనకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాడిని సునాయాసంగా అధిగమించి మన గమ్యానికి చేరుకోవాలని అర్ధం. ఇక ఆ తరువాత జీవితంలోని కష్టాలను, సుఖాలను అన్నిటినీ ఒక అనుభవంలా భావించి జీవితంలోని కష్టాలను ఓర్చుకుంటూ దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటూ మన గమ్యం వైపు అడుగులు వేయాలని చివరి లైన్లలో చాలా అద్భుతంగా తెలిపారు రామజోగయ్య శాస్త్రి గారు.

మన జీవితంలోని కష్టాలు ఎంత చిన్నవో ఇలాంటి పాటలు వింటుంటే మనకు అర్ధమవుతుంది. ప్రతీ ఒక్కరూ మన కష్టాలను చూసి భయపడకుండా వాటికి ఎదురెళితే విజయం తప్పక వరిస్తుంది. మరి తన సాహిత్యం ద్వారా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిన రామజోగయ్య శాస్త్రి గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కలం నుండి మరెన్నో స్ఫూర్తిదాయకమైన పదాలు వెలువడాలని కోరుకుందాం.

  • ఎస్ ఏ టి శ్రీనాథ్
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments