కోవిడ్ వారియర్స్ కోసం టాలీవుడ్ హీరోలు నడుం బిగిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ క్రికెట్ బ్యాట్స్ తో అండగా నిలుస్తామంటున్నారు. నిఖిల్, సాయిధరమ్, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, ప్రిన్స్, అశ్విన్ తదితరులతో పాటు థమన్ కూడా క్రికెట్ ఆడటానికి సై అన్నారు. వచ్చే ఆదివారం ఐఆర్ఎస్ ఆఫీసర్స్ తో ఫ్రెండ్లీ పోటీకి సిద్ధపడుతున్నారు. శంకర్ పల్లిలో ఓ ప్రైవేట గ్రౌండ్ లో ఆదివారం ఉదయం పది గంటలకు జరగబోయే క్రికెట్ మ్యాచ్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎం.పి. సంతోష్, సి.పి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొనే ఈ మ్యాచ్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కూడా కొద్ది సేపు భాగం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments