ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ఖ్యాతి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కాలంతో సంబంధం లేకుండా శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఆపద మొక్కులవాడు గా వడ్డీ కాసుల వాడుగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు భక్తులు.

అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకునే భక్తులు అలిపిరి టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే గత ఏడాది మార్చి లోనే టోల్ ఛార్జీలను పెంచుతూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. కానీ ఇటీవల జగన్ సర్కార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడంతో ఛార్జీలు ఇక నుంచి భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అలిపిరి టోల్ గేట్ వద్ద ఛార్జీలు 15 రూపాయలు మాత్రమే వసూలు చేయగా ఇక నుంచి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మినీ బస్సు మినీ లారీ టోల్ ఛార్జీలు 50 రూపాయల నుంచి వంద రూపాయలకు పెంచారు. ఇక లారీ బస్సు కు ప్రస్తుతం వంద రూపాయల టూల్ చార్జీ వసూలు చేస్తుండగా దాన్ని రెండు వందల రూపాయలకు పెంచారు. సాధారణంగా అయితే వారాంతాలు పండుగలు సెలవు దినాల్లో తిరుమల తిరుపతికి భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టోల్ చార్జీలను భారీగా పెంచుతూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ ఉండటం తో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది,

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments