దేశంలోని ప్రజలకు ఇందన ధరలు పెడుతున్న మంట వల్ల కలుగుతున్న బాధ చెప్పడానికి కూడా నోరు రావడం లేదట.ఉన్న వాడికి ఈ ధరల నొప్పి తెలియదు.

కానీ పూట పూట తిండి కోసం డొక్కలు ఎండబెట్టుకుని, రెక్కలు ముక్కలు చేసుకునే వారికి మాత్రం బ్రతక లేక చావాలనిపిస్తుందట.అంతలా ఈ ఇందన ధరలు మానసిక క్షోభకు గురిచేస్తున్నాయట.

ఇకపోతే పేదల మంట కేంద్రానికి తాకిందో ఏమో తెలియదు గానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం క్రమంగా తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.గత కొద్దిరోజులుగా ఇంధనం ధరలు పెరుగుతూ పోతుండటంతో వినియోగదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయని మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.అంతే కాకుండా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని తాము జీఎస్‌టీ కౌన్సిల్‌కు తరచు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

ఇక జీఎస్‌టీ కౌన్సిల్ పెట్రోల్ విషయంలో తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలుపుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments