కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.ఎందుకంటే పేరులోనే ఉందిగా కలెక్షన్ కింగ్ అని.
దీంతోనే ఈయన పేరు అంతటా మోగిపోతుంది.

ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేకుండా బోర్డు లు గానీ, ఫ్లెక్సీలు గానీ ఏర్పాటు చేసిన వారిపై కొరడా ఝుళిపించారు.అందులో మోహన్ బాబు ఒకరు.ఎందుకంటే హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ ఫిలింనగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డు ఉందట.దీంతో ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు.

కాగా కలెక్షన్ కింగ్ ఇంటి ముందు సుమారు 15 అడుగుల ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మెంట్ అధికారులు ఈ జరిమానా వేశారట.అదీగాక జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్టు, జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారట.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments