సామాజిక మాధ్యమం ట్విటర్‌లో చురుగ్గా ఉండే తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ జనరల్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య 5 లక్షలు దాటింది. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర పూర్తి చేసుకున్న ఆమె(ఃఛీటఖ్చీఝజీజూజీట్చజీజఠఠి) ఏ విజ్ఙప్తి వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దాంతో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌ను గురువారం రాత్రి 8:20 గంటలకు 5,00,500 మంది అనుసరిస్తుండగా, ఆమె మాత్రం 632 మందిని అనుసరిస్తున్నారు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో పాటు సినీనటులు, తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ వేత్తలు, పలువురు వైద్యులు ఉన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments