తెలంగాణా రాష్ట్రంలో నిన్న పట్టపగలే నడి రోడ్డు మీద న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
కాగా దంపతులను హత్య చేసి పారిపోయిన నిందితులను పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారట.
ఇకపోతే వామన్ రావు దంపతులను హత్య చేసింది కుంట శ్రీనివాస్ తో పాటు మంథని మండలం విలోచన పురం కు చెందిన చిరంజీవిగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా మంథని మండల గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణం విషయంలో వామనరావు, శ్రీనుకు మధ్య తలెత్తిన వివాదాలే గట్టు దంపతుల హత్యకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే టీఆర్ఎస్ నాయకునిగా ఉన్న కుంట శ్రీనివాస్ ను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం వెల్లడించింది.ఇక ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తిగా కుంట శ్రీనివాస్ ఉన్న విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments