తెరాస పై మండిపడ్డ అరవవింద్

182

తెలంగాణాలో రాజకీయపోరు మంచి జోరుమీద ఉన్నట్లుగా ఉంది.టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు శృతి మించుతుంది.

ఈ నేపధ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ‌లోని అధికార టీఆర్ఎస్‌ పార్టీని బొంద పెట్టే వరకు తాము నిద్రపోమని బీజేపీ ఎంపీ అర్వింద్ పేర్కొంటున్నారు.

ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచేందుకే నిజామాబాద్ సీపీ కార్తికేయకు పోస్టింగ్ ఇచ్చారని, ఆయ‌న‌కు మ‌రో చోటకు పదోన్నతి వచ్చినప్ప‌టికీ కార్తికేయ నిజామాబాద్ జిల్లాను వదలడం లేదని ఆరోపించారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం హిందువులను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోంద‌ని, ఈ క్రమంలో రోహింగ్యాల పాస్ పోర్టు జారీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని వెల్లడిస్తున్నారు.

ఇకపోతే తెలంగాణాలో దొరపాలన సాగుతుందని, అందువల్ల తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని అర్వింద్ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here