ఎటువంటి నేరం చేయకుండా ఐదేళ్లు అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్న ఓ యువకుడి కథే ‘నాంది’. సినిమాలో ఓ సెక్షన్ గురించి చర్చించాం. రేపు సినిమా విడుదలయ్యాక అదేంటో తెలుసుకోవాలని చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తారు. కథ విన్నాక… నేనూ అదే పనిచేశా” అని ‘అల్లరి’ నరేశ్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘నాంది’ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ ”న్యాయవ్యవస్థ నేపథ్యంలో తీసిన చిత్రమిది. కథలో ఎటువంటి లోపాలు ఉండకూడదని జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పోలీసు అధికారులను కలిసి చర్చించాం. పాత్ర కోసం శారీరకంగానూ చాలా కష్టపడ్డా. ‘లడ్డూబాబు’ తర్వాత ఈ సినిమా కోసం మళ్లీ అంత కష్టపడ్డా. ‘గమ్యం’లా దీనికి చక్కటి టీమ్ కుదిరింది. తప్పకుండా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను” అని అన్నారు.
నేడు విడుదల కానునున్న నాంది
Subscribe
Login
0 Comments