అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యు బుష్ హాజరయ్యారు. వీరంతా మాజీ ప్రథమ మహిళలు, తమ భార్యలైన మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్, లారా బుష్‌తో కలిసి వచ్చారు.
కాగా, బైడెన్ తొలుత వాషింగ్టన్‌లోని అధ్యక్ష అతిథి గృహం నుంచి చర్చ్‌కు వెళ్లి ప్రార్థనలు చేశారు. సెనేట్ రిపబ్లికన్ నాయకుడు మిచ్ మ్యాక్కన్నెల్, ప్రతినిధుల సభ రిపబ్లికన్ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీ కూడా ఆయన వెంట ఉండి తమ ఐక్యతను చాటారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.