ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించి, అక్కున చేర్చుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నర్సింగ్‌యాదవ్‌ అని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పదిరోజుల క్రితం నర్సింగ్‌యాదవ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం సుల్తాన్‌బజార్‌లోని ఆయన నివాసం వద్ద పది రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గోవింద్‌రాఠి పాల్గొని నర్సింగ్‌యాదవ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నటుడు నర్సింగ్‌యాదవ్‌ సతీమణి చిత్ర, కుమారుడు రుత్విక్‌యాదవ్‌, సోదరుడిని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి సెలబ్రిటీగా ఎదిగాడని, సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు.

నర్సింగ్‌యాదవ్‌కు సినీ నటుల నివాళి

నర్సింగ్‌యాదవ్‌ పది రోజుల కార్యక్రమాన్ని రాంకోఠిలోని ఈడెన్‌గార్డెన్‌లో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటులు ఉత్తేజ్‌, శివాజీ, డైలాగ్‌ ఆర్టిస్టులు, విలన్‌ నటులు, సైడ్‌ యాక్టర్స్‌ సుమారు 500 మంది పాల్గొని నర్సింగ్‌ యాదవ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments