యువ నటసింహా నందమూరి తారకరత్న టైటిల్ పాత్రలో నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవినేని’ దీనికి ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బెజవాడకు చెందిన ఇద్దరు నేత మధ్య స్నేహం, రాజకీయ కక్ష్యల నేపథ్యంలో వారి మధ్య ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూపించనున్నారు.

ఈ వేడుకకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి జీవితా రాజశేఖర్, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా పోస్టర్, చిత్రం ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. ‘ నందమూరి తారకరత్న అద్భుతమైన నటుడని, ఈ సినిమా విజయన్నివాలని కోరుకుంటున్నానని, కరోనా పరిస్థితుల వల్ల ఇండస్ట్రీ ఆటుపోట్లకు గురైంది. థియేటర్లు తిరిగి ప్రేక్షకులతో కళకళ లాడటం ఆనందంగా ఉందని అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ”దేవినేని పాత్రకు తారకరత్న ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సినిమాలో నటించడం ఎంతో సంతృప్తిని కలిగించింది” అని అన్నారు.

చిత్ర దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరిస్తారు. గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటికి ఈ సినిమాకు పోలిక లేదన్నారు. నిజాలను నిర్భయంగా ఈ సినిమాలో చూపించాం. రంగాను ఎవరు చంపారు అన్నది చూపించాం అని శివనాగు అన్నారు.

జీఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో టీ ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించారు. హార్రర్ మూవీ ‘ఎవరు’ చిత్రం తర్వాత తారక్ రత్న ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నాళ్లగానో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తారక్ కు ఈ చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments