టీడీపీ నేత సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

385

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్‌ వేదిక ద్వారా తెలిపారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిందని.. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌ళో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. “ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.” అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా..ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 377 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. ఇందులో 8,73,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,038 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7122కి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here