టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున అరుదైన గౌరవం దక్కించుకున్నారు. భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే పేరు మీద నెలకొల్పిన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నాగార్జున ఎంపికయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు నాగార్జునకు దక్కింది. ఈ అవార్డుల జాబితాను తాజాగా ప్రకటించారు.

టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ ఎంపికైంది. అలాగే ఉత్తమ నటుడుగా నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ), ఉత్తమ హీరోయిన్‌గా రష్మిక (డియర్ కామ్రేడ్), ఉత్తమ దర్శకుడుగా సుజిత్ (సాహో), ఉత్తమ సంగీత దర్శకుడుగా తమన్ ఎంపికయ్యారు. తెలుగుతోపాటు ఇతర భాషలకు సంబంధించిన అవార్డుల జాబితా కూడా తాజాగా విడుదలైంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments