టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 రోడ్ల జంక్షన్‌ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని, చంద్రబాబుతో కలిసి తమని వెళ్లనివ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డగించడంతో మాజీ మంత్రి చినరాజప్ప ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత నడుచుకుంటూ వెళ్లి, ఆటోలో రామతీర్థానికి బయలుదేరారు.

అంతకుముందు, విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా రామతీర్థం బయలు దేరారు. మరోవైపు చంద్రబాబు రామతీర్థం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయనగరం జిల్లాలో పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేయగా..మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments