కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరోగా కీర్తింపబడుతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబయోగ్రఫీ (సోనూసూద్ ఆత్మకథ) ‘ఐ యామ్ నో మెస్సీయ’ అనే పుస్తకాన్ని సోనూ రాసారు. ఈ పుస్తకాన్ని రీసెంట్గా చిరంజీవికి అందించిన సోనూసూద్ ఇప్పుడు కేబీసీ సెట్స్‌లో అమితాబ్‌కు అందించారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ సూట్లో కనిపిస్తున్న వీరిద్దరిని ఇలా చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఆచార్య చిత్రంతో పాటు తెలుగు, హిందీ భాషలకు సంబంధించిన పలు సినిమాలలో నటిస్తున్నారు.
కేబీసీ సెట్స్‌లో సోనూసూద్ ఏం చేసాడో తెలుసా..
Subscribe
Login
0 Comments