మాస్ మహరాజ్ అంటే తెలుగు ప్రేక్షకులు అందరూ రవితేజా అంటారు. అదేవిదంగా రవితేజా కూడా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటారు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అబిమానుల్లో ఖిలాడీ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌ను రవితేజ తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటుగా మిమ్మల్ని అలరించడానికి సమ్మర్‌లో వస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments