మాస్ మహారాజ్ రవితేజ తన అభిమానులకు డబుల్ బొనాంజా అందించాడు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తను నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు . సంక్రాంతికి విడుదల కాబోతున్న తన క్రాక్ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకీ వాయిస్ ఓవర్ అందించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments