సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఎవరి స్టైల్లో వారు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. బిగ్ బాస్ మిత్ర త్రయం మోనాల్, అఖిల్, సోహెల్‌లు కలిసి వేడుక జరుపుకున్నారు. హౌజ్‌లో ఉన్న సమయంలో వీరి ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇప్పుడు అదే రిలేషన్‌ను బయట కూడా కొనసాగిస్తూ లైఫ్‌ను సరదాగా గడుపుతున్నారు.
మొన్నటి వరకు ఇంటర్వ్యూలు, ఇతరత్రా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ముగ్గురు న్యూ ఇయర్ సందర్భంగా కలిసారు. లైవ్ వీడియో కూడా చేశారు. ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరు ముగ్గురు కలిసి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రీసెంట్గా నాగబాబు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మోనాల్ హాజరు కాలేదు. వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన తను హాజరు కాలేకపోయిందని అంటున్నారు.