స్టార్ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి 26 రోజుల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే.రజనీకాంత్ యూటర్న్ తీసుకోవడంపై ప్రజల నుంచి, ఆయన అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.రజనీకాంత్ స్నేహితులలో ఒకరైన మోహన్ బాబు తాజాగా రజనీ తీసుకున్న నిర్ణయం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు రజనీకాంత్ ఆత్మీయుడనే విషయం తెలుసని.ఆరోగ్యపరమైన కారణాల వల్లే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు.చాలామంది అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే ఒక స్నేహితుడిగా తాను మాత్రం రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని భావిస్తున్నానని వెల్లడించారు.రజనీకాంత్ చీమకు కూడా హాని చేయడని అలాంటి వ్యక్తికి రాజకీయాలు సరిపడవని అన్నారు.

తన దృష్టిలో రజనీ గొప్ప మనిషి అని.అలాంటి వ్యక్తికి రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు.డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనడం తమకు సాధ్యం కాదని తెలిపారు.ఎవరికీ ద్రోహం చేయని నిక్కచ్చిగా మాట్లాడే తమకు రాజకీయాల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాదని అన్నారు.

అప్పటివరకు మంచివాళ్లు అన్నవాళ్లే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చెడ్డవాళ్లు అంటారని తెలిపారు.

రాజకీయం అంటే బురద అని.అలాంటి బురదలోకి దిగకపోతేనే మంచిదని మోహన్ బాబు తెలిపారు.రజనీకాంత్ ఎంత మంచివాడో ఆయన అభిమానులు కూడా అంతే మంచివాళ్లని రజనీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

మరోవైపు రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తన స్నేహితులైన చిరంజీవి, మోహన్ బాబు రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడంతో రజనీకాంత్ కూడా వెనుకడుగు వేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments