మెగస్టార్ ఎమోషనల్ ట్వీట్

433

2020 సంవత్సరం ముగిసింది. సంవత్సరం మొత్తం కరోనా నామ జపాన్ని చేసేలా చేసింది. ఎంతో మంది జీవితాల్లో చీకట్లను నింపింది ఈ సంవత్సరం. సినీ ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని తీసుకువచ్చింది 2020. ప్రస్తుత పరిస్థితులలో కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2021 సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‏గా స్వాగతం పలికారు.

2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశాడు. అందులో.. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి.

అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చిరు మరో మూడు చిత్రాల్లో నటించనున్నారు. త్వరలోనే ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్. అటు ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి న్యూఇయర్ విషెస్..

Wishing a Very Happy, Healthy & Fulfilling New Year 2021 for you and all your dear ones!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here