వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). సంపూర్ణ వినోదంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించగా, దిల్ రాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సాధించిన విజయంతో మేకర్స్ ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేయాలని భావించారు.

వెంకటేష్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమా తాలూకు కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయగా, ఇందులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ తోపుడు బండ్లలో డబ్బులు నింపుకొని హుషారుగా షికారు చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఈ రోజు ఎఫ్ 3 నుండి మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో వెంకీ, వరుణ్‌లు డబ్బులని చూసి మైమరచిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ‘ఈసారి మూడింతల వినోదంతో ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సమ్మర్‌కు మూవీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments