టిక్ టాక్ యాప్ లో డ్యాన్స్ వీడియోల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో దుర్గారావు ఒకరు.విచిత్రమైన ఎక్స్ ప్రెషన్లతో దుర్గారావు వేసే స్టెప్పులు, దుర్గారావు భార్య పాట పాడుతున్నట్టు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ వీళ్లిద్దరికీ మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

ఢీ ఛాంపియన్స్ షోలో దుర్గారావు, ఆయన భార్యను అనుకరిస్తూ పండు చేసిన నాదీ నక్కిలీసు గొలుసు పాట వారికి మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ఆ పాపులరిటీ జబర్దస్త్ షోతో పాటు ఇతర షోలలో కూడా దుర్గారావు, అతని భార్య కనిపిస్తున్నారు.

దూర్గారావు నాట్యమండలిపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా ఓపెన్ చేశారు.అయితే దుర్గారావుకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం.స్టార్ హీరో రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.దుర్గారావు క్రాక్ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

దుర్గారావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.మొదట ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయాలని భావించిన దర్శకనిర్మాతలు ఐదు రోజులు ముందుగా జనవరి 9వ తేదీనే విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండటం, సంక్రాంతి పండుగకు విపరీతమైన పోటీ ఉండటంతో ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments