తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాపించేసిందా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 20 మంది రిపోర్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన సీసీఎంబీ పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా పంపించింది. రాష్ట్రంలోకి స్ట్రెయిన్ వచ్చిన మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నా ఈ 20 మందిలో ఎంత మందికి స్ట్రెయిన్ ఉందన్నది మాత్రం ఇంకా వైద్యాధికారులు వెల్లడించలేదు. అనధికారిక సమాచారం ప్రకారం మూడింటా ఒక వంతు మందిలో N440k ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా మ్యుటేట్ అవుతోందని కూడా అధికారులు చెబుతున్నారు.

20 మంది శాంపిల్స్ ఫలితాలు, వారి జీన్ మ్యాపులను కూడా సీసీఎంబీ కేంద్రానికి పంపించింది. అయితే రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్రం దీనిపై బాహాటంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని ఆదేశించింది. వివిధ రాష్ట్రాలనుంచి కొత్త స్ట్రెయిన్ కేసుల నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్రం వీటన్నింటినీ మధించి ఒక సమగ్ర నివేదికను రూపొందించి, మరింత అధ్యయనం చేస్తోంది. రేపు సాయంత్రం దీనిపై కేంద్రం ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టే ఆస్కారముంది. మరోవైపు సీసీఎంబీ రిపోర్టులపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రహస్య సమీక్షా సమావేశం నిర్వహించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments