ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరస్ పై ఉండే కొమ్ము భాగాల్లో మార్పులు చోటు చేసుకొని శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తున్నాయి. కరోనా వైరస్ కంటే రూపాంతరం చెందిన కొత్త వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ తరహా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ప్రపంచ ఆరోగ్యసంస్థకు కూడా ఇదే విషయాన్ని నిపుణులు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే భారత్ దీనికి సంబంధించి అప్రమత్తం అయింది. యూకే నుంచి రానున్న ఫ్లైట్స్‌ నిలిపివేసింది.

ఈ నిలిపివేత ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అంతకన్నా ముందు యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు భారత విమానాశ్రయాలలో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. అయితే యూకే నుంచి రానున్న విమానాలను జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్‌ ల్యాండ్, బల్జీరియా తదితర దేశాలు నిలిపివేశాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. మరికొన్ని రోజులలో ఈ జాబితాలో మరిన్ని దేశాలు చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కొత్త రకం వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను వైద్య శాఖ ట్రాక్ చేయనుంది. ఎయిర్ పోర్ట్ లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఆస్పత్రులకు తరలించనుండగా నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ లో ఉండేలాగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments