ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఎటువంటి పరిస్థితులలోనైనా తానున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి ఇబ్బంది తనదిగా భావించేవాడే అసలైన ప్రజానాయకుడు . అయితే ఇప్పుడు ఈ కోవకు చెందిన వారు చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ఆ కొద్దిమందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు ఒకరు . ఒక జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు ప్రజల సమస్యలపై మంచి అవగాహన ఉంది .

ఆ అనుభవంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టమని ఎంతో మంది సూచించగా అందరి ప్రోత్సహంతో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు కన్నబాబు.
ఆ టైంలో కన్నబాబు ను చిరంజీవి బాగా ఆకర్షించారు. చిరంజీవి కన్నబాబు మధ్య మంచి సాన్నిహిత్యం కూడా కుదిరింది. అలా ప్రజారాజ్యం ద్వారా రాజకీయ్యాల్లోకి వచ్చిన కన్నబాబు 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు.
తర్వాత జరిగిన కొన్ని రాజకీయమార్పులు వల్ల ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోవడంతో కన్నబాబు కూడా కాంగ్రెస్ లో చేరారు.కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు.అక్కడి అంతర్గత రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.ఒక దశలో చిరంజీవికి కూడా చెప్పకుండా పార్టీకి రాజీనామా చేశారు.అలా 2014 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి మరోసారి గెలిచారు.
అయితే.. 2015లో జగన్ పార్టీ కన్నబాబును ఆకర్షించింది. పైగా కన్నబాబు గురుంచి తెలుసుకున్న జగన్ స్వయంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు.దీంతో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కన్నబాబు ఏకంగా జిల్లా అధ్యక్షుని పదవి అందుకున్నారు. అప్పటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు లేవనెత్తారు.ఇలా నియోజకవర్గంలో ఒక మంచి స్థానానికి చేరుకున్నారు.

బాగా చదువుకున్న కన్నబాబు అధిష్ఠానానికి దగ్గరగా ఉండటం ఇష్టపడరు.అధిష్ఠానానికి దూరంగా ప్రజలకి దగ్గరగా ఉంటారు ఈయన. స్వయంగా మంత్రే తమ వద్దకు వచ్చి తమ బాగోగులను అడిగి తెలుసుకోవడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో ఎక్కువ మాట్లాడినా ఎక్కువ తిరిగిన సందర్భాలు కూడా లేవు. అయినా కన్నబాబు టాలెంట్ ను ప్రజలు గుర్తించారు.అతనికి ఏకంగా మంత్రిపదవి కట్టబెట్టారు.
అధికారులను పరుగులు పెట్టిస్తూ తరచూ సమీక్షలు జరుపుతూ మరో వైపు ముఖ్యమంత్రితో వీడియో సమావేశాల్లో పాల్గోంటూ అనుసంధానంగా కన్నబాబు ఉంటూ వస్తున్నారు. నిజానికి గ్యాస్ లీకేజ్ ఘటన జరిగినపుడు వైసీపీకి చెడ్డ పేరు వచ్చి పరువు పోవడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా విశాఖ టూర్ పెట్టుకున్నారు. బాధితులను ఓదార్చడమే కాకుండా భారీ నష్టపరిహారం ప్రకటించి విపక్షానికి మాట లేకుండా చేశారు. ఆ తరువాత జగన్ బాధ్యతను అంతా కన్నబాబు భుజాన మోస్తున్నారు.
మొత్తం మీద చూసుకుంటే కన్నబాబు జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేశారని, అయిదేళ్ల పాటు ఆయన కుర్చీని కదల్చడం ఎవ్వరివల్ల కాదని మాట వినిపిస్తోంది.
అందరూ అభిమానించే అరుదైన ప్రజానాయకుడు కన్నబాబు గారికి మరోసారి మన తాజావార్తలు ద్వారా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు